Tuesday 11th August 2026
12:07:03 PM
Home > తాజా > నాగచైతన్య-శోభిత పెళ్లిపై నాగార్జున ఏమన్నారంటే !

నాగచైతన్య-శోభిత పెళ్లిపై నాగార్జున ఏమన్నారంటే !

Nagarjuna On Son Chaitanya-Sobhita Marraige | నటుడు నాగచైతన్య ( Naga Chaitanya ), నటి శోభిత ధూళిపాళ్ల పెళ్లి వేడుకపై అక్కినేని నాగార్జున ( Akkineni Nagarjuna ) కీలక వ్యాఖ్యలు చేశారు.

వీరిద్దరి పెళ్లి డిసెంబర్ 4న జరగనున్నట్లు చెప్పారు. పెళ్లిని సింపుల్ గా చేసుకోవాలని నాగచైతన్య భావించినట్లు, కాబోయే దంపతుల కోరిక మేరకు పెళ్లిని ఆడంబరం లేకుండ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

డిసెంబర్ 4న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ ( Annapurna Studios ) వేదికగా పెళ్లి జరగనుండడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. అన్నపూర్ణ స్టూడియో స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు ( Akkineni Nageshwara Rao ) కి ఎంతో ఇష్టమైన ప్రదేశమని గుర్తుచేసుకున్నారు.

చైతన్య శోభిత పెళ్లికి బంధువులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు కలిపి కేవలం 300 మంది వరకు హాజరవుతారని నాగార్జున పేర్కొన్నారు. అలాగే పెళ్ళిపనులను చైతన్య శోభితనే చూసుకుంటున్నట్లు చెప్పారు. పెళ్లి అచ్చమైన తెలుగు సంప్రదాయం ప్రకారం జరుగుతుందన్నారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions