Thursday 21st November 2024
12:07:03 PM
Home > క్రీడలు > 51/2 నుండి 53 పరుగులకే ఆల్ ఔట్..బౌలర్ల ఊచకోత

51/2 నుండి 53 పరుగులకే ఆల్ ఔట్..బౌలర్ల ఊచకోత

53 All Out Western Australia vs Tasmania | బౌలర్లు ( Bowlers ) రెచ్చిపోతే ఎం జరుగుతుందో తాజగా ఓ మ్యాచ్ లో నిరూపితమైంది. ఓ దశలో 51 పరుగులకు రెండు వికెట్లే కోల్పోయిన టీం అనంతరం కేవలం రెండు పరుగులకు ఎనిమిది వికెట్లు కోల్పోయింది.

సాధారణంగా బౌలర్లపై బ్యాట్సమెన్స్ ( Batsmen ) హవా ఉంటుందని అందరూ అంటారు. కానీ ఆస్ట్రేలియా దేశవాళీ ( Domestic ) క్రికెట్ లో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. దింతో ఓ చెత్త రికార్డ్ నమోదైంది. ఆస్ట్రేలియా వన్డే కప్ ( Oneday Cup ) లో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ వెస్టర్న్ ఆస్ట్రేలియాకు టాస్మానియా ( Tasmania ) జట్టు చుక్కలు చూపించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టర్న్ ఆస్ట్రేలియా ఓ దశలో రెండు వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. కానీ టాస్మానియా బౌలర్ వెబ్ స్టర్ ( Webster ) ధాటికి పేకమేడలా ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ ( Lineup ) కుప్పకూలింది. ఆఖరికి 53 పరుగులకే సదరు టీం ఆల్ ఔట్ ( All Out ) అయ్యింది.

ఓపెనర్ ఆర్కి షార్ట్ ( D’Arcy Short ) 22 పరుగులతో టాప్ స్కోరర్. కానీ ఆరుగురు బ్యాట్సమెన్స్ డక్ ఔట్ అయ్యారు. వెబ్ స్టర్ కు తోడుగా స్టాన్ లేక్ మూడు, రోజేర్స్ ఒక వికెట్ తీశారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన టాస్మానియా మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్ ను చేదించింది.

You may also like
వలలో చిక్కిన చిరుత..వండుకుని తినేసిన వేటగాళ్ళు
అమెరికాలో అదానిపై కేసు..కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
థ్యాంక్యూ డిప్యూటీ సీఎం పవన్ సార్
అదానీపై అమెరికాలో కేసు..షేర్లు డమాల్ !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions