Friday 18th October 2024
12:07:03 PM
Home > Uncategorized > వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సి.ఎస్. శాంతి కుమారి టెలీకాన్ఫరెన్స్|

వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సి.ఎస్. శాంతి కుమారి టెలీకాన్ఫరెన్స్|

Cyclone Migjam| హైదరాబాద్, డిసెంబర్ 5 : బంగాళా ఖాతం ( Bay Of Bengal ) లో ఏర్పడిన తీవ్ర తూఫాన్ ప్రభావంతో ఉత్తర, దక్షణ తెలంగాణా ( Telangana ) జిల్లాలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ( Shanthi Kumari ) టెలీ కాన్ఫరెన్స్ ( Tele Conference ) నిర్వహించారు.

ఈ టెలికాన్ఫరెన్స్ లో విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ( Rahul Bojja ) తోపాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ( Khammam ), ములుగు, హన్మకొండ, వరంగల్ ( Warngal ), జనగాం, మహబూబబాద్, సూర్యాపేట ( Suryapeta ) తదితర జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా సి.ఎస్. శాంతి కుమారి మాట్లాడుతూ, నేడు, రేపు రెండురోజులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు.

భారీ వర్షాలు, వరదలు వచ్చిన సందర్భంలో పాటించాల్సిన ప్రొటొకాల్స్ ( Protocal ) కు అనుగుణంగా తగు చర్యలు చేపట్టాలని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం ( Bhadradri Kotthagudem ), ములుగు ( Mulugu ) జిల్లాలకు ఒక్కొక్క ఎన్డీఆర్ఎఫ్ ( NDRF ) బృందాలను పంపిస్తున్నామని పేర్కొన్నారు.

ఇప్పటికే పూర్తిగా నిండిన చెరువులకు గండ్లు పడకుండా తగు ముందు జాగ్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

నీటిపారుదల శాఖ, విపత్తుల నిర్వహణ శాఖ, రోడ్లు భవనాలు, పంచాయితీ రాజ్ ( Panchayati Raj ), రెవెన్యూ శాఖ లు అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా వరదలు వచ్చే అవకాశం ఉన్నందున కాజ్-వె, లోతట్టు ప్రాంతాల వద్ద తగు జాగ్రత చర్యలు చేపట్టాలని అన్నారు.

అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా పునరావాస కేంద్రాలను ముందుగానే గుర్తించాలని సి.ఎస్ శాంతి కుమారి సూచించారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions