YS Jagan Tweet on Pawan Kalyan Son Mark Shankar Pawanovich | అగ్నిప్రమాదంలో గాయపడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు త్వరగా కోలుకోవాలని కోరారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
ఆంద్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనయుడు సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న విషయం తెల్సిందే. పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ లో చదువుతున్న స్కూల్ లో అగ్ని ప్రమాదం సంభవించింది.
మంటల్లో చిక్కుకున్న ఆ బాలుడి చేతులు, కాళ్లకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ స్పందించారు. సింగపూర్ లోని పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కుమారుడు గాయపడ్డాడని తెలిసి తాను షాక్ కు గురయినట్లు జగన్ పేర్కొన్నారు.
కష్ట సమయంలో పవన్ కుటుంబం ధైర్యంగా ఉండాలన్నారు. మార్క్ శంకర్ పవనోవిచ్ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. ఇదిలా ఉండగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో మార్క్ శంకర్ అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వెంటనే స్కూల్ సిబ్బంది అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.