Saturday 28th February 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘చంద్రబాబు గారు రైతులు లబోదిబో మంటున్నారు’

‘చంద్రబాబు గారు రైతులు లబోదిబో మంటున్నారు’

Ys Jagan News Latest | ముఖ్యమంత్రి చంద్రబాబు ష్యురిటీ అంటే మోసం గ్యారంటీ అని ఎద్దేవా చేశారు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్.

‘చంద్రబాబు గారూ మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు. కాని, రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా? మీరు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ రెండేళ్లపాటు రైతులకు ఎరువుల కష్టాలే. బస్తా యూరియా కోసం రోజుల తరబడి రైతులు క్యూల్లో నిలబడే దారుణ పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు? మరోవైపు తాజాగా ఉల్లి, చీనీ, మినుము ధరలు కూడా పతనమై రైతులు లబోదిబో మంటున్నారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా మీలో కనీసం చలనం లేదు చంద్రబాబుగారూ? ‘ అని జగన్ ఫైర్ అయ్యారు.

ఏటా ఏ సీజన్‌లో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగవుతాయి, ఎరువులు ఎంత పంపిణీ చేయాలన్నదానిపై ప్రతిఏటా ప్రభుత్వంలో కసరత్తు జరుగుతుందని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో యూరియా సమస్య ఎందుకు వచ్చిందని నిలదీశారు. ఐదేళ్ల తమ పాలనలో ఇలాంటి సమస్య ఎప్పుడూ లేదన్నది వాస్తవం అని తెలిపారు.

You may also like
బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్..స్పందించిన పవన్
వివాహేతర సంబంధం..విడాకులు కోరిన విజయ్ భార్య
భర్త సీఎం..భార్య ఎమ్మెల్యే..అసెంబ్లీలోనే ప్రశ్నించిన సతీమణి!
లిక్కర్ కేసులో కవితకు రిలీఫ్..కేటీఆర్ ఏమన్నారంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions