Monday 12th January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ట్రంప్ కు మద్దతుగా WWE స్టార్స్ అండర్టేకర్, కేన్

ట్రంప్ కు మద్దతుగా WWE స్టార్స్ అండర్టేకర్, కేన్

WWE Legends Underataker, Kane Endorse Donald Trump | అమెరికా ( USA ) దేశ అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి.

డెమోక్రటిక్ పార్టీ ( Democratic Party ) తరఫున వైస్ ప్రెసిడెంట్, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ ( Kamala Harris ), రిపబ్లికన్ పార్టీ ( Republican Party ) తరఫున మాజీ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నారు. వీరిద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

ఈ క్రమంలో ప్రముఖ డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ ( WWE Superstars ) అధ్యక్ష అభ్యర్థులకు తమ మద్దతును ప్రకటిస్తున్నారు. డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్స్ అండర్టెకర్ ( Undertaker )మరియు కేన్ ( Kane ) తమ మద్దతును డోనాల్డ్ ట్రంప్ కు ప్రకటించారు. ఈ మేరకు ట్రంప్ తో కలిసి ఒక వీడియోను విడుదల చేశారు.

ఎలక్షన్ మేనియా ( Election Mania ) లో ట్రంప్ కు ఓటు వేసి అమెరికా భవిష్యత్ ను కాపాడాలని వారు కోరారు. మరోవైపు మరో డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ బటిస్టా కమలా హారీస్ కు మద్దతు తెలిపారు.

ఇదిలా ఉండగా కేన్ ప్రస్తుతం టెన్నీసీ ( Tenneesee ) రాష్ట్రం నాక్స్ కౌంటీ ( Knox County )కి మేయర్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీ సభ్యుడు.

You may also like
అల్లు అర్జున్ పాట పాడి అదరగొట్టిన కేంద్రమంత్రి
చెప్పులు లేకుండా రోడ్డుపై రౌడీలు..గుంటూరు పోలీసుల తీరే వేరు!
‘హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారు’..ఒవైసీ vs బండి
సైబర్ వలలో జేడీ లక్ష్మీనారాయణ సతీమణి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions