Ratan Tata Successor | వ్యాపార దిగ్గజం రతన్ టాటా ( Ratan Tata ) బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల రాజకీయ, సినీ, పారిశ్రమకవేత్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. దేశం ఒక ముద్దుబిడ్డను కోల్పోయిందని అభిమానులు నివాళులర్పిస్తున్నారు.
ఇదిలా ఉండగా రతన్ టాటా వారసుడు ఎవరు అనే అంశం చర్చనీయాంశంగా మారింది. రతన్ టాటాకు పిల్లలు లేకపోవడంతో ట్రస్ట్ లో వాటా ఎవరికి దక్కుతుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కాగా, రతన్ టాటా సవితి తల్లి కుమారుడు నోయల్ టాటాకు ముగ్గురు పిల్లలు. మాయ టాటా, నెవిల్లే టాటా, లేహ్ టాటా. ఈ ముగ్గురే రతన్ టాటా అనంతరం సంస్థ వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఈ ముగ్గురు టాటా సంస్థలోనే వివిధ హోదాలో పనిచేస్తున్నారు. అలాగే రతన్ టాటా వ్యక్తిగత సంపాదన రూ.3,800 కోట్లు ఉంటుందని అంచనా. ఇవి కూడా ఎవరికి చెందుతాయి అనేది వేచి చూడాలి.