Virat Kohli only Indian cricketer to give fitness test in London | టీం ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం కుటుంబంతో లండన్ లోనే ఉన్నారు. మరోవైపు భారత ఆటగాళ్లకు ఫిట్నెస్ కోసం యోయో టెస్టుతో పాటు బ్రాంకో టెస్టును సైతం బీసీసీఐ అమల్లోకి తెచ్చింది.
ఇప్పటికే రోహిత్ శర్మ, శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్ తో పాటు మరికొందరు ఫిట్నెస్ టెస్టుల్లో పాల్గొన్నారు. వీరికి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఫిట్నెస్ పరీక్షలు జరుగుతున్నాయి. మరోవైపు విరాట్ కోహ్లీ సైతం ఫిట్నెస్ పరీక్షలకు సిద్ధం అయ్యారు.
ఈ నేపథ్యంలోనే కోహ్లీ కోసం బీసీసీఐ స్పెషల్ పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. లండన్ లోనే కోహ్లీకి యోయో, బ్రాంకో టెస్టులు నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విమర్శలు సైతం వ్యక్తం అవుతున్నాయి.
అందరి ఆటగాళ్లకు ఒకే విధమైన నిబంధనలు ఉండాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా టెస్టులకు, టీ-20 లకు రిటైర్మెంట్ ఇచ్చిన కోహ్లీ, రోహిత్ శర్మ అక్టోబర్ లో ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ కోసం సిద్దమవుతున్నారు.









