Vijayawada Subbayyagari Hotel Seized | కాకినాడ సుబ్బయ్యగారి హోటల్ ( Kakinada Subbayagari Hotel ) తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులర్ ( Popular ). కాకినాడలో మొదలైన హోటల్ ప్రస్థానం నేడు బ్రాంచులుగా విస్తరించింది.
అయితే తాజాగా విజయవాడలోని సుబ్బయ్యగారి హోటల్ ను అధికారులు సీజ్ ( Seize ) చేశారు. వివరాల్లోకి వెళ్తే విజయవాడలోని సుబ్బయ్యగారి హోటల్ కు వచ్చిన కస్టమర్ భోజనం ఆర్డర్ ( Order )చేశారు.
తీరా భోజనం వచ్చాక చూస్తే అందులో జెర్రి ( Jerry )దర్శనమిచ్చింది. ఇదేంటని హోటల్ సిబ్బందిని ప్రదించాడు. అయితే ఇదే సమయంలో ఆ హోటల్ లో మానవ హక్కుల కమిషన్ ఇంచార్జి చైర్మన్ విజయభారతి కూడా ఉన్నారు.
భోజనంలో జెర్రి విషయం తెలుసుకున్న ఆమె సీరియస్ అయ్యారు. కాకినాడ సుబ్బయ్యగారి హోటల్ యాజమాన్య తీరుపై ఆగ్రహించిన విజయభారతి ఫుడ్ సేఫ్టీ ( Fodd Safety ) అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్ ను సీజ్ చేశారు. అలాగే ఫుడ్ శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించారు.