Vijayashanthi About Kavitha Suspension From BRS | బీఆరెస్ పార్టీ నుంచి తన కుమార్తె కవితను సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
అనంతరం కవిత మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావు పై తీవ్రస్థాయి ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ విజయశాంతి స్పందించారు. బీజేపీ-బీఆరెస్ మధ్య రహస్య అవగాహన ఉందని, ఇందులో భాగంగానే కవితను సస్పెండ్ చేశారని ఆమె పేర్కొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్ జరగడం వల్లే బీఆర్ఎస్ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా బీజేపీకి మెజారిటీ వచ్చిందని విజయశాంతి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ని దెబ్బతీయాలనే అజెండాతో మొదలైన ఈ రహస్య అవగాహన గుట్టు ఇప్పుడు కవిత చెప్పిన మాటల ద్వారా బయట పడిందని తెలిపారు.
ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ ల మధ్య భవిష్యత్తులో జరగబోయే సీక్రెట్ ఒప్పందాలకు అవరోధాలు రావొచ్చనే భయంతోనే బీఆర్ఎస్ అధిష్టానం కవితను సస్పెండ్ చేశారని విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు.









