Vijayasai Reddy News | రాజ్యసభ మాజీ సభ్యులు విజయసాయి రెడ్డి సంచలన పోస్ట్ చేశారు. ఇప్పుడాయన చేసిన పోస్ట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత రెండు దశాబ్దాలుగా జరిగిన మతమార్పిడిలపై కమిటీ వేసి ప్రభుత్వం విచారణ జరపాలని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. డబ్బులు ఇచ్చి మత మార్పిడిలు.. అమ్ముడుపోతున్న హిందువులు అనే శీర్షికతో ఉన్న ఒక వీడియోపై విజయసాయి రెడ్డి స్పందించారు.
‘హిందూ మతం పై కుట్రలు సహించేది లేదు, డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే అటువంటి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పిద్దాం. గత రెండు దశాబ్దాలుగా జరిగిన మతమార్పిడులపై కమిటీ వేసి ప్రభుత్వం విచారణ జరపాలి. దేశం కోసం ధర్మం కోసం హిందువులు లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒక్కటవ్వాలి అదే భారతదేశానికి రక్ష శ్రీరామ రక్ష’ అని ఆయన స్పష్టం చేశారు. ఏడాది క్రితం తాను సుదీర్ఘంగా కొనసాగిన వైసీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన విషయం తెల్సిందే.









