UP Cop ‘Scans’ Man With Mobile Phone and Calls Him Bangladeshi | ఉత్తరప్రదేశ్ పోలీసులు చేసిన ఓ పని ఇప్పుడు విమర్శలకు దారి తీసింది. ఓ వ్యక్తిని సెల్ ఫోన్ తో స్కాన్ చేసి అనంతరం అతను బంగ్లాదేశ్ కు చెందిన పౌరుడు అని పోలీసులు ప్రకటించడం ఇప్పుడు వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. యూపీ లోని ఢిల్లీకి సమీపంలో ఉన్న ఘజియాబాద్ నగరంలో ఇటీవల పోలీసులు తనికీలు నిర్వహించారు. అక్రమంగా భారత్ లోకి చొరబడిన గుర్తించేందుకు ఈ తనికీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. అయితే ఓ బస్తీలోకి వెళ్లిన పోలీసులు అక్కడ ఓ వ్యక్తిని ప్రశ్నించారు. తాను బీహార్ అరారియా జిల్లాకు చెందిన వాడిని అని సదరు వ్యక్తి బదులిచ్చారు.
ఇదే సమయంలో ఓ పోలీసు అధికారి తన ఫోన్ ను ఓపెన్ చేసి, వ్యక్తిని స్కాన్ చేశారు. అనంతరం ‘నువ్ బంగ్లాదేశీయుడివి’ అని పోలీసులు చెప్పడంతో సదరు వ్యక్తి కంగు తిన్నాడు. ‘మేము స్కాన్ చేశాం, నీ అడ్రెస్ బంగ్లాదేశ్ లో చూపిస్తుంది’ అని పోలీసులు చెప్పారు. కాగా డాక్యుమెంట్ల ఆధారంగా స్వదేశీయుడా లేదా అక్రమంగా భారత్ లోకి చొరబడ్డారా అనేది నిర్థారిస్తారు. కానీ సూపర్ మార్కెట్ లో వస్తువులను స్కాన్ చేసినట్లు వ్యక్తిని స్కాన్ చేసి బంగ్లాదేశీయుడు అని ప్రకటించడం ఇప్పుడు ఆసక్తి గా మారింది. కాగా దీనిపై ఇప్పటివరకు యూపీ పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.









