Union Minster Suresh Gopi | కేంద్ర పర్యాటక, పెట్రోలియం శాఖ సహాయ మంత్రి, నటుడు సురేశ్ గోపి (Suresh Gopi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయాల కంటే కూడా సినిమాల్లో నటించడమే ఇష్టమని వ్యాఖ్యానించారు.
తాను కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన ఆదాయం పూర్తిగా ఆగిపోయిందని, డబ్బు సంపాదించుకోవడానికి మళ్లీ నటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
సోమవారం కన్నూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సురేశ్ గోపి మాట్లాడుతూ… తాను మళ్లీ సినిమాల్లో నటించాలనుకుంటున్నట్లు తెలిపారు. ‘నాకు మంత్రి పదవి కావాలని ఎన్నడూ ప్రార్థించలేదు.
ప్రజలు ఎన్నుకున్న మొదటి ఎంపీని కాబట్టి, పార్టీ నన్ను మంత్రిని చేయాలని భావించింది. నేను మంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి నా ఆదాయం పూర్తిగా ఆగిపోయింది.
అందుకే డబ్బు సంపాదించుకోవడానికి మళ్లీ సినిమాల్లో నటించాలనుకుంటున్నాను” అని తెలిపారు. పార్టీలో తానే చిన్నవాడినని, తన స్థానంలో రాజ్యసభ ఎంపీ సి. సదానందన్ మాస్టర్‌కు మంత్రి పదవి ఇవ్వాలని సురేశ్ గోపీ సూచించారు.









