Wednesday 16th July 2025
12:07:03 PM
Home > క్రైమ్ > ఇష్టంలేని పెళ్లి చేసుకున్న మేనకోడలు..విందు భోజనంలో విషం కలిపిన మామ

ఇష్టంలేని పెళ్లి చేసుకున్న మేనకోడలు..విందు భోజనంలో విషం కలిపిన మామ

Uncle Poisons Food At Niece’s Wedding Reception | తన మేనకోడలు తనకు కు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని మామ వంటకాల్లో విషం కలిపాడు.

ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్ర ( Maharashtra )లో చోటుచేసుకుంది. కొల్హాపూర్ ( Kolhapur ) జిల్లా పంహాల మండలం ఉత్రే ( Utre ) గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన మహేష్ పాటిల్ ఇంట్లో మేనకోడలు రిసెప్షన్ ( Reception )కు వెళ్లి బంధువులు తినే ఫుడ్ లో విషం కలిపాడు.

ఇది గమనించిన కొందరు అతన్ని పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకునే లోపే నిందితుడు పరారయ్యాడు. కేసును నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

విషం కలిపిన ఆహారాన్ని ఎవరు తినకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చిన్నప్పటి నుండి తన ఇంట్లో పెరిగిన మేనకోడలు వేరే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి జరగడం ఇష్టం లేని మామ ఇలా రిసెప్షన్ కు వెళ్లి ఆహారంలో విషం కలిపాడు.

You may also like
rajagopal raju
టాలీవుడ్ నటుడు రవితేజ కుటుంబంలో తీవ్ర విషాదం!
బ్రిటన్ రాజుతో టీం ఇండియా ప్లేయర్లు
భూమిపైకి వచ్చేసిన శుభాంశు శుక్లా
పార్టీ నాయకుడి కుమారుడికి జగన్ నామకరణం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions