TSRTC MD Sajjanar | ప్రముఖ తెలుగు ఛానల్ లో నిర్వహించే రియాలిటీ షో బిగ్ బాస్ 7 ఫైనల్ (Bigg Boss 7) ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని అన్న పూర్ణ స్టూడియోస్ దగ్గర విన్నర్ ప్రశాంత్ (BB7 winner Prashanth), రన్నరప్ అమర్ దీప్ (Amardeep) ఫ్యాన్స్ మధ్య ఘర్ష ణ జరిగింది.
“వారిలో కొంతమంది హౌస్ బయట ఆర్టీసీ బస్సులను బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు.
ఇదేం అభిమానం! బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్ లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి #TSRTC కి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ధ్వంసం అయ్యాయి.
ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేసి.. దర్యాప్తు చేస్తున్నారు. అభిమానం పేరుతో చేసే పిచ్చి చెష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదు.
ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టే. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు.
టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది” అని ఎక్స్ వేదికగా హెచ్చరించారు సజ్జనార్.









