Thammudu Twitter Review | టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Actor Nithin) నటించిన తాజా చిత్రం తమ్ముడు (Thammudu). వేణు శ్రీరామ్ (Venu Sriram) దర్శకత్వంలో దిల్ రాజు (Dil Raju), శిరీష్ నిర్మించిన చిత్రం ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ లయ కీలక పాత్ర పోషించింది.
నితిన్ సరసన వర్ష బొల్లమ్మ (Varsha Bollamma), సప్తమి గౌడ (Saptami Gowda) హీరోయిన్స్ గా నటించారు. శుక్రవారం ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్, యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా తెరెకెక్కింది.
వరుస ప్లాపుల తర్వాత నితిన్ చేసిన ఈ సినిమాపై ఆడియన్స్ లో చాలా అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా చూసిన వారు సోషల్ మీడియా ప్లాట్ ఫాం వేదికగా రివ్యూ ఇస్తున్నారు. తమ్ముడు సినిమాపై ప్రేక్షకుల నుంచి మిక్స్ డ్ టాక్ వినిపిస్తోంది.
అక్కకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే తమ్ముడిగా నితిన్ తన కెరీర్ లోనే బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడని చెబుతున్నారు. ఫస్టాఫ్ ఎబోవ్ యావరేజ్ అనీ, సెకండాఫ్ లో ఫైట్ సీక్వెన్స్ అదిరిపోయాయని పోస్ట్ చేస్తున్నారు నెటిజన్స్. ముఖ్యంగా నటీనటులు అందరూ ఎమోషన్స్ సీన్స్ లో బాగా యాక్ట్ చేశారని కితాబిస్తున్నారు. అజనీష్ లోక్ నాథ్ ఇచ్చిన బీజీఎం ఆకట్టుకుందంటున్నారు ఆడియన్స్.





