Sunday 1st March 2026
12:07:03 PM
Home > తాజా > TGSRTC బస్సుల్లో టికెట్ ధరలపై ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన!

TGSRTC బస్సుల్లో టికెట్ ధరలపై ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన!

tsrtc

TGSRTC MD Sajjanar | తెలంగాణలో ఆర్టీసీ బస్సు (TGSRTC) ఛార్జీలకు సంబంధించి సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ (Sajjanar) కీలక ప్రకటన చేశారు. TGSRTC బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తెలిపారు.

సాధారణ చార్జీలు యథాతథంగానే ఉన్నాయని పేర్కొన్నారు. హైవేలపై టోల్ చార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఆ పెంచిన టోల్ చార్జీల మేరకు టికెట్ లోని టోల్ సెస్ ను సంస్థ సవరించడం జరిగింది. ఈ సవరించిన టోల్ సెస్ ఈ నెల 3వ తేదీ నుంచే అమల్లోకి వచ్చింది.

Read Also: కలకాలం గుర్తుండిపోయే అపురూప జ్ఞాపకం: చిరంజీవి ట్వీట్!

టోల్ ప్లాజాలున్న రూట్లలోనే టోల్ సెస్ ను యాజమాన్యం సవరించింది. సాధారణ రూట్లలో టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పుల్లేవు. టీజీఎస్ఆర్టీసీ సాధారణ బస్ ఛార్జీలను పెంచిందని వాస్తవాలు తెలుసుకోకుండా ఉద్దేశ్యపూర్వకంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం మంచిది కాదు.

సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా తప్పుడు ప్రచారం చేసే వారిపై పోలీస్ శాఖ సహకారంతో చట్ట ప్రకారం టీజీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అని హెచ్చరించారు సజ్జనార్.

You may also like
జమ్మూ జయహో..67 ఏళ్ల నిరీక్షణకు తెర!
రాష్ట్రంలో భారీ పేలుడు..భారీగా మృతులు
మెప్పు కోసం గొప్పలకు వెళ్లొద్దు..మంచు సందేశం
ఇరాన్ పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..ఏం జరగనుందో!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions