tension situation in gajwel city
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సొంత నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
వివరాల్లోకి వెళితే నిన్న రాత్రి పట్టణంలోని శివాజీ విగ్రహం వద్ద ఒక వ్యక్తి మద్యం మత్తులో మూత్రవిసర్జన చేశాడు.దానితో హిందుసంఘాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.
కారణం మూత్రవిసర్జన చేసిన వ్యక్తి ముస్లిం కావడంతో గజ్వేల్ పట్టణంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఆ వ్యక్తిని పట్టుకున్న శివాజి విగ్రహ కమిటీ అతన్ని పోలీస్ స్టేషన్లో అప్పగించారు.అతనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో గజ్వేల్ పట్టణంలో హిందుసంఘాలు భారీ ర్యాలి తీశారు. కానీ ర్యాలీలో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ర్యాలీలో పాల్గొన్న వారిపైన బాదం పాల సీసాలను విసిరారు.
ఇక ఈ ఘటన నేపథ్యంలో హిందువులంతా కలిసి మళ్లీ అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకొని ధర్నా తో పాటు రాస్తారోకో నిర్వహించారు.
రంగంలోకి దిగిన పోలీసులు హిందుసంఘాలని శాంతిపజేసే ప్రయత్నం చేశారు. దాడి చేసిన వారిని అరెస్ట్ చేస్తాం అని హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ఈరోజు గజ్వేల్ పట్టణ బంద్ కు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి.బంద్ సందర్బంగా గజ్వేల్ పట్టణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.