Friday 6th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > నారా లోకేశ్ పర్యవేక్షణ..ఏపీకి నేపాల్ లో చిక్కుకున్న వారు

నారా లోకేశ్ పర్యవేక్షణ..ఏపీకి నేపాల్ లో చిక్కుకున్న వారు

Telugu people airlifted from Nepal | ప్రభుత్వ అవినీతి, అక్రమాలకు మరియు వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా నేపాల్ లో యువత తిరగబడిన విషయం తెల్సిందే.

ఈ నేపథ్యంలో ప్రభుత్వాధినేతలు రాజీనామాలు చేశారు. కాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జెన్-జెడ్ చేపట్టిన ఉద్యమం ఉధృతంగా మారింది. ఈ నేపథ్యంలో పలువురు ఆంధ్రప్రదేశ్ వాసులు నేపాల్ లో చిక్కుకున్నారు. ఈ తరుణంలో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తెలుగువారిని సురక్షితంగా తీసుకురావడానికి రెండు రోజులుగా ఆర్టీజీఎస్ కమాండ్ సెంట్రల్ నుంచి పర్యవేక్షించారు.

కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీ వాసులు సురక్షితంగా రాష్ట్రానికి పయనమయ్యారు. నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి ప్రత్యేక విమానంలో 144 మంది ఆంధ్రప్రదేశ్ బయలుదేరారు. ఈ ప్రత్యేక విమానం విశాఖపట్నం చేరుకోనుంది. ఆ తర్వాత తిరుపతిలో ల్యాండ్ అవుతుంది. వైజాగ్ లో 104 మంది, తిరుపతిలో 40 మంది దిగనున్నారు. వీరికి స్వాగతం పలికేందుకు కూటమి ఎమ్మెల్యేలు, అధికారులు సిద్ధమయ్యారు.

You may also like
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం
‘బీఆర్ నాయుడు కాదు..బీఆర్ కామ నాయుడు’
టీటీడీ ఛైర్మన్ వైరల్ వీడియోలు..స్పందించిన బీఆర్ నాయుడు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions