Telangana Police Warns Social Media Influencers | సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు గేమింగ్ యాప్స్ ( Gaming Apps )పేరిట బెట్టింగ్ యాప్స్ ( Betting ) ను మరియు ఫేక్ ట్రేడింగ్ ( Fake Trading ) యాప్స్ ను ప్రమోట్ ( Promote ) చేస్తున్నారు.
దింతో ఇన్‌ఫ్లుయెన్సర్లను నమ్మి ఫేక్ యాప్స్ వినియోగించిన బాధితులు రూ.లక్షలను పోగొట్టుకున్నారు. ఈ క్రమంలో ఇన్‌ఫ్లుయెన్సర్లకు తెలంగాణ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
సోషల్ మీడియాలో ప్రమోషన్లు చేసే ముందు జాగ్రత్త వహించాలని ఇల్లీగల్ యాప్స్ ను ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. బెట్టింగ్, ఫేక్ ట్రేడింగ్ యాప్స్ పై నిత్యం నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో ఫేక్ ప్రమోషన్లు చేస్తే జైలు శిక్ష తప్పదని, కాసుల కక్కుర్తితో జైలు పాలోవ్వద్దని సూచించారు. ఫేక్ ప్రమోషన్లతో ఇతరుల జీవితాలను నాశనం చేయొద్దని పేర్కొన్నారు.