Telangana Panchayat Elections | తెలంగాణ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఏకగ్రీవాలు, నామినేషన్లు, ప్రచారం మరియు పోలింగ్ ఇలా సర్పంచ్ ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో చిత్ర విచిత్ర ఘటనలు వెలుగు చూశాయి. తాజగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ మహిళా అభ్యర్థికి సున్నా ఓట్లు వచ్చాయి. దింతో పోటీ చేసిన ఆమె తన ఓటు తనకు వేసుకోలేదా, కుటుంబ సభ్యులు కూడా వేయలేదా అని నెటిజన్లు ముచ్చటించుకుంటున్నారు.
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం కీర్యా తండాలో మూడవ విడతలో భాగంగా బుధవారం ఎన్నిక జరిగింది. ఈ క్రమంలో మొత్తం 239 ఓట్లకు గాను 235 పోల్ అయ్యాయి. బోడ విజయ అనే అభ్యర్థికి 156 ఓట్లు పోల్ అవ్వగా, బాదావతు లలితకు 79 ఓట్లు వచ్చాయి. ఇకపోతే మూడు ఓట్లు చెల్లలేదు. ఒక ఓటు నోటాకు పడింది. అయితే గౌతమి బోడ అనే మరో అభ్యర్థికి సున్నా ఓట్లు లభించాయి. దింతో ఆమె తన ఓటును కూడా ఇతరులకు వేసిందా, కుటుంబ సభ్యులు కూడా ఆమెకు ఓటు వేయలేదా అనే నెటిజన్లు చర్చించుకుంటున్నారు.









