Thursday 8th May 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > “తెలంగాణను FUTURE STATE గా పిలుద్దాం “: సీఎం రేవంత్

“తెలంగాణను FUTURE STATE గా పిలుద్దాం “: సీఎం రేవంత్

telangana future state

CM Revanth US Tour | అమెరికా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక ప్రకటన చేశారు. ఇకపై మన తెలంగాణ రాష్ట్రాన్ని.. తెలంగాణ ప్యూచర్ స్టేట్ అని పిలుద్దామని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు.

హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రం “ది ఫ్యూచర్ స్టేట్”కు పర్యాయపదంగా నిలుస్తుందని సీఎం ప్రకటించారు.

కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్‌టేబుల్‌లో టెక్ యునికార్న్స్ సీఈఓలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. ఐటీ యూనికార్న్ ప్రతినిధులందరూ తెలంగాణకు రావాలని ఆహ్వానించారు. ‘మీ భవిష్యత్తును ఆవిష్కరించుకొండి. అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం” అని పిలుపునిచ్చారు.

‘ఇప్పటి వరకు మేము న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, టెక్సాస్‌లో పర్యటించాం. ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉన్నాం. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక లక్ష్యం.. ఆ లక్ష్యాన్ని సూచించే నినాదం ఉంది. అవుటాఫ్ మెనీ.. వన్ అనేది న్యూయార్క్ స్టేట్ నినాదం. టెక్సాస్‌ను లోన్ స్టార్ స్టేట్ అని పిలుస్తారు. కాలిఫోర్నియాకు యురేకా అనే నినాదం ఉంది.

అయితే మన ఇండియాలోని రాష్టాలకు ఇటువంటి ప్రత్యేక నినాదాలేమీ లేవు. ఇప్పటినుంచి మన తెలంగాణ రాష్ట్రానికి అటువంటి ఒక లక్ష్య నినాదాన్ని ట్యాగ్ లైన్ గా పెట్టుకుందాం. ఇకపై మన రాష్ట్రాన్ని తెలంగాణ ఫ్యూచర్ స్టేట్​.. అని పిలుద్దాం..’ అని సీఎం ప్రకటించారు.

ప్రపంచ టెక్ పరిశ్రమలకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​ బాబు గారు అన్నారు. పెట్టుబడులకు అనుకూలమైన విధానాలను తమ ప్రభుత్వం అనుసరిస్తుందని స్పష్టం చేశారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యునికార్న్ కంపెనీల వ్యవస్థాపకులు స్వయంగా హైదరాబాద్‌ను సందర్శించాలని మంత్రి ఆహ్వానించారు. అక్కడ పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, సదుపాయాలను పరిశీలించాలని కోరారు.

You may also like
cm revanth reddy
ఆ విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శం: సీఎం రేవంత్!
tg ssc results
పదో తరగతి ఫలితాల్లో ఈ జిల్లా టాప్!
cm revanth reddy
కేసీఆర్ ప్రసంగంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏమన్నారంటే!
cm revanth meets jana reddy
జానా రెడ్డితో సీఎం రేవంత్ భేటి.. కారణం ఏంటంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions