TDP vs YCP News | తల్లికి వందనం పథక ఆలోచన మంత్రి నారా లోకేశ్ దే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల వ్యాఖ్యానించారు.
ఈ మేరకు శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జెడ్పీ పాఠశాలలో నిర్వహించిన ‘పేరెంట్స్-టీచర్స్ మీటింగ్’ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో వైసీపీ స్పందించింది. ఏ మాత్రం సిగ్గులేకుండా నాడు-నేడు పథకం క్రెడిట్ కొట్టేసేందుకు ప్రయత్నించడం సిగ్గనిపించడం లేదా చంద్రబాబు అని జగన్ పార్టీ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది.
40 ఏళ్ల రాజకీయ జీవితంలో సొంతంగా ఒక్క పథకాన్ని తీసుకురాని చంద్రబాబు, ఇప్పుడు వైయస్ జగన్ తెచ్చిన అమ్మ ఒడి ని తన ఖాతాలో వేసుకుంటున్నాడని వైసీపీ విమర్శించింది.
అమ్మ ఒడి పథకం ఎవరు తెచ్చారన్నది రాష్ట్రంలో చిన్న పిల్లాణ్ణి అడిగినా చెబుతాడని పేర్కొంది. కానీ చంద్రబాబు మాత్రం ఏమాత్రం తడబడకుండా అబద్ధాలు ఆడేయగలడని జగన్ పార్టీ ధ్వజమెత్తింది.