TDP Allegations On Ysrcp | విద్యార్థుల కిట్, భోజనంలో గుడ్డు పేరుతో వైసీపీ హయాంలో రూ.1000 కోట్ల మేర కుంభకోణం జరిగిందని ఆరోపించింది తెలుగుదేశం పార్టీ.
ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ఈ ఏడాది విద్యార్థులకు ఇచ్చేందుకు స్టూడెంట్ కిట్లను ప్రభుత్వం కొనుగోలు చేయగా ఈ స్కాం బయటపడినట్లు వివరించింది. ఈ ఏడాది స్టూడెంట్ కిట్లను రూ.612.32 కోట్లకు కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసిందని, అయితే ఇంతకంటే నాసిరకం కిట్లను వైసీపీ ప్రభుత్వంలో రూ.676.12 కోట్లతో కొనుగోలు చేశారని పేర్కొంది.
ఏడాదికి రూ.63.79 కోట్లు అదనంగా చెల్లించడం ద్వారా సుమారు రూ.320 కోట్లను జగన్ హయాంలో నొక్కేశారని తెలిపింది. ఇదే రకంగా విద్యార్థుల భోజనంలో వడ్డించే గుడ్లలో కూడా రూ.కోట్ల మేర అక్రమాలు చేసినట్లు టీడీపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో వైసీపీ హయాంలో జరిగిన స్కామ్ పై కూటమి ప్రభుత్వం విచారణ జరుపుతున్నట్లు టీడీపీ వెల్లడించింది.