Swiggy Satires On Union Budget 2025 | యూనియన్ బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala Sitharaman ) శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్ లో బీహార్ రాష్ట్రంపై వరాల జల్లు కురిపించారు. ఈ ఏడాది చివర్లో బీహార్ లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ క్రమంలో బీహార్ కు మఖానా బోర్డు ( Makhana Board ), పశ్చిమ కోసి కెనాల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ( National Institute Of Food Technology ) మరియు నాలుగు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టులు ఇలా బడ్జెట్ లో బీహార్ కు భారీగా నిధులు కేటాయించారు. ఎన్డీయే కూటమిలో బీహార్ సీఎం నితీష్ కుమార్ పార్టీ కీలకంగా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే.
అసెంబ్లీ ఎన్నికలు దృష్ట్యా బీహార్ కు ప్రత్యేక ప్యాకేజీని పక్కన పెట్టిన కేంద్రం బడ్జెట్ లో కీలక కేటాయింపులు చేసింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా బడ్జెట్ పై ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గి 2025 బడ్జెట్ పై సెటైర్లు వేసింది.
సోషల్ మీడియా వేదికగా బీహార్ స్పెషల్ వంటకం లిట్టి ఫోటోను షేర్ చేసింది. ‘ఈరోజు బ్రేక్ ఫాస్ట్ లో బీహార్ స్పెషల్ లిట్టి ఉంది’ అంటూ స్విగ్గి చేసిన పోస్ట్ వైరలయ్యింది.