Suryakumar Yadav in recovery after successful sports hernia surgery in Germany | టీం ఇండియా స్టార్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ గత కొంతకాలంగా స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతున్నాడు.
ఈ క్రమంలో సర్జరీ కోసం జర్మనీ వెళ్లిన విషయం తెల్సిందే. తాజగా పొత్తికడుపులో కుడివైపున స్పోర్ట్స్ హెర్నియాతో బాధ పడుతున్న సూర్య కుమార్ కు సర్జరీ విజయవంతంగా జరిగింది. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
జర్మనీ లోని మ్యూనిచ్ నగరంలోని ఓ ఆసుపత్రిలో ఈ శస్త్రచికిత్స జరిగింది. ఇది సూర్యకు మూడవ సర్జరీ. 2023లో మడమకు ఆపరేషన్ జరగగా, 2024లో హెర్నియాకు సర్జరీ జరిగింది. ఇకపోతే తాజా సర్జరీపై సూర్య స్పందించారు. ప్రస్తుతం కొలుకుంటున్నట్లు, త్వరగా మైదానంలోకి అడుగుపెట్టాలని ఉందన్నారు.
ఇదిలా ఉండగా ఇటీవల ముగిసిన ఐపీఎల్-2025 సీజన్ లో సూర్య కుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. ఈ సీజన్ లో అతడు 717 పరుగులు చేశాడు. అలాగే ముంబయి ఇండియన్స్ జట్టును ప్లేఆప్స్ కు చేర్చడంలో కీలకంగా వ్యవహరించిన విషయం తెల్సిందే.









