Suryakumar Yadav Donates Match Fees to Indian Army | టీం ఇండియా టీ-20 జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆసియా కప్ లో భాగంగా తన మ్యాచుల ఫీజును దేశ సాయుధ బలగాల మద్దతు కోసం మరియు పహల్గాం ఉగ్రదాడి బాధితులకు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటన చేశారు.
ఆసియా కప్ లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్స్ లో దాయాధి పాకిస్థాన్ ను చిత్తు చేసిన భారత్ తొమ్మిదవ సారి ఆసియా కప్ ట్రోఫీని ముద్దాడింది. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించిన సూర్య..’నేను ఈ టోర్నమెంట్ నుండి నా మ్యాచ్ ఫీజును మన సాయుధ బలగాలకు మరియు పహల్గామ్ ఉగ్రవాద దాడిలో బాధితులైన కుటుంబాలకు మద్దతుగా విరాళంగా ఇవ్వాలని నిర్ణయించాను. మీరు ఎల్లప్పుడూ నా ఆలోచనలలో ఉంటారు. జై హింద్’ అని పోస్ట్ చేశారు.
ఇకపోతే ఆసియా కప్ లో దాయాధి దేశంతో మ్యాచుల సందర్భంగా పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు నిరాకరిస్తూ కెప్టెన్ హోదాలో సూర్య నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. అలాగే లీగ్ మ్యాచులో భాగంగా పాకిస్థాన్ పై గెలుపును పహల్గాం ఉగ్రదాడి బాధితులకు అంకితమిచ్చారు.









