Suravaram Sudhakar Reddy | భారత కమ్యూనిస్టు దిగ్గజ నేత, పార్లమెంటు మాజీ సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
వయోభార అనారోగ్య సమస్యలతో పాటు శ్వాస తీసుకోవడంలో గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో తాజగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 83 ఏళ్ల వయసులో మరణించారు.
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాకు మూడు సార్లు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అలాగే 1988, 2004లో నల్గొండ పార్లమెంట్ స్థానం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. సుధాకర్ రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, పెదనాన్న సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ సాయుధపోరాటంలో కీలక పాత్ర పోషించారు.
తెలంగాణ మలి దశ ఉద్యమంలో సుధాకర్ రెడ్డి కీలక భూమిక పోషించారు. కాగా సుధాకర్ రెడ్డి మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.









