Sri Lankan Cricketers In Pakistan Request To Return Amid Security Concerns | శ్రీలంక క్రికెట్ జట్టు ప్రస్తుతం పాకిస్థాన్ దేశంలో పర్యటిస్తోంది. అయితే ఇటీవలే పాక్ రాజధాని ఇస్లామాబాద్ లో సూసైడ్ బాంబు దాడి జరిగింది. ఇందులో 12 మంది వరకు మరణించారు.
ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్ జట్టు ప్లేయర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంల్ స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డును ప్లేయర్లు అనుమతి కోరారు. శ్రీలంక-పాక్ మధ్య మూడు వన్డే మ్యాచుల సిరీస్ కొనసాగుతుంది. మొదటి వన్డే రావల్పిండి స్టేడియంలో జరగగా పాక్ గెలిచింది. ఇదే సమయంలో ఇస్లామాబాద్ లో భారీ బాంబు దాడి జరిగింది. రావల్పిండికి మరియు ఇస్లామాబాద్ కు మధ్య దూరం కేవలం 20 కి.మీ. మాత్రమే. ఈ క్రమంలో శ్రీలంక ఆటగాళ్లు బెంబేలెత్తిపోయారు.
తమను స్వదేశానికి తీసుకెళ్లాలని శ్రీలంక క్రికెట్ ను కోరారు. అయితే ఆటగాళ్లు పాకిస్థాన్ తో వన్డే సిరీస్ ను ఆడాల్సిందేనని శ్రీలంక క్రికెట్ స్పష్టం చేసింది. ఆటగాళ్ల భద్రతకు సంబంధించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరిపిననట్ల శ్రీలంక క్రికెట్ అధికారులు వెల్లడించారు. సిరీస్ మధ్యలోనే స్వదేశానికి తిరిగి రావలనుకుంటే చర్యలు కూడా ఉండే అవకాశం ఉందని శ్రీలంక తమ ఆటగాళ్లను హెచ్చరించడం గమనార్హం.
ఈ క్రమంలో శుక్రవారం, ఆదివారం రావల్పిండి మైదానంలో మిగిలిన రెండు వన్డేలు జరుగుతాయని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇదిలా ఉండగా 2009లో పాక్ లో పర్యటిస్తున్న శ్రీలంక ఆటగాళ్ల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే.









