Spirit Movie | సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా చాలా రోజుల క్రితమే ‘స్పిరిట్’ మూవీని ప్రకటించిన విషయం తెల్సిందే. తాజగా ఈ మూవీ ఆదివారం లాంఛనంగా మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టి షూటింగ్ ను ప్రారంభించారు. ఆదివారం జరిగిన పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరయ్యారు. తొలి సీన్ కు క్లాప్ కొట్టారు.
ఈ మేరకు మూవీ టీం ఫోటోలను విడుదల చేసింది. కాగా ప్రభాస్ ఈ మూవీలో పోలీస్ పాత్రలో కనిపించనున్న విషయం తెల్సిందే. ఇప్పటికే విజువల్ లేకుండా కేవలం ఆడియోతోనే రిలీజ్ అయిన టీజర్ మూవీ పై అంచనాలు పెంచేసింది. ప్రభాస్ సరసన ‘యానిమాల్ ఫేమ్’ త్రిప్తి డిమ్రి నటించనున్నారు. ప్రకాష్ రాజ్, వివేక్ ఒబేరాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్స్, టీ-సిరీస్ బ్యానర్ల పై ఈ సినిమా తెరకెక్కనుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యహరించనున్నారు.









