Spirit First Look | రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ఫుల్ బాటిల్ కూడా గ్లాసులా కనిపిస్తుంది, ఇదీ ప్రభాస్ కటౌట్ అంటూ అభిమానులు చేస్తున్న పోస్టులు వైరల్ గా మారుతున్నాయి. న్యూ ఇయర్ నేపథ్యంలో రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమా ‘స్పిరిట్’. భారీ అంచనాల నడుమ ఈ సినిమా రూపొందుతుంది. తాజగా మూవీకి సంబంధించి ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. ప్రభాస్ రగడ్ లుక్ లో, మాస్ అవతార్ లో కనిపించడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. అయితే ఫస్ట్ లుక్ కు సంబంధించి ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
మేకర్స్ విడుదల చేసిన లుక్ లో గాయాలతో ఉన్న ప్రభాస్ ఓ చేతిలో మద్యం బాటిల్, నోట్లో సిగరెట్ తో ఉన్నారు. సినిమాలో హీరోయిన్ త్రిప్తి దిమ్రి సిగరెట్ ను వెలిగిస్తున్నారు. అయితే ప్రభాస్ చేతిలో పట్టుకున్న బాటిల్ ను తొలుత అందరూ గ్లాస్ అనుకున్నారు. కానీ ఆ తర్వాత బాగా నిశితంగా గమనిస్తే అది మద్యం బాటిల్ అని అర్ధం అవుతుంది. ఈ క్రమంలో ప్రభాస్ వంటి వ్యక్తి చేతిలో బాటిల్ కూడా గ్లాసులా కనిపిస్తుందని ఇదీ రెబల్ స్టార్ కటౌట్ అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.








