Speed Breaker Theft | సాధారణంగా దొంగలు అంటే డబ్బు, బంగారం, బైకులు, కార్లు చోరీ చేస్తుంటారు. మరీ కక్కుర్తి పడితే కరెంటు వైర్లు, స్టీలు వస్తువలు కూడా దొంగతనం చేస్తుంటారు. అయితే మధ్యప్రదేశ్ లోని విదిశ నగరంలో ఓ విచిత్ర దొంగతనం జరిగింది.
దొంగలు ఏకంగా స్పీడ్ బ్రేకర్లను కూడా దొంగిలించారు. నగరంలో ట్రాఫిక్ కంట్రోల్ కోసం మున్సిపల్ అధికారులు కొద్ది రోజుల కిందట రూ.8 లక్షలతో రద్దీ రోడ్లపై స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. అయితే దొంగలు రాత్రికి రాత్రే మెయిన్ రోడ్డుతోపాటు పలు జంక్షన్లలోని స్పీడ్ బ్రేకర్లను ఎత్తుకెళ్లారు.
పోలీసుల నిఘా ఎక్కువగా ఉన్నప్పటికీ వారి కళ్లుగప్టి ఎవరికి తెలియకుండా చోరీ చేశారు. ఈ ఘటనపై మున్సిపల్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ వింత దొంగతననానికి సంబంధించి వార్త మీడియాలో వైరల్ అవుతోంది.









