- వేసవిలో ప్రత్యేక రైళ్లు
Special Trains To Tirupati | తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. వేసవి సెలవుల సందర్భంగా తిరుమల వెళ్లే భక్తుల రద్దీ పెరగనున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ నుండి తిరుమల వెళ్లే శ్రీవారి భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.
దక్షిణ మధ్య రైల్వే ఏప్రిల్ , మే నెలల్లో వారానికి రెండు ప్రత్యేక రైళ్లను నడపనుంది. మే 23వ తేదీ వరకు ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. రైలు నెంబర్ 07017 చర్లపల్లి నుండి ప్రతి శుక్రవారం, ఆదివారం రాత్రి 10:35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10:10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో.. రైలు నెంబర్ 07018 తిరుపతి నుండి ప్రతి శనివారం, సోమవారం సాయంత్రం 4:40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:10 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఈ ఏప్రిల్ 11, 13, 18, 20, మే 4, 9 తేదీలలో రాత్రి 10:35 గంటలకు చర్లపల్లి నుండి బయలుదేరి ఉదయం 10:10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 12, 14, 19, 21, 26, 28.. మే 3, 5, 10, 12, 17, 19, 24, 26, 31 తేదీలలో తిరుపతి నుండి సాయంత్రం 4:40 గంటలకు బయలుదేరి ఉదయం 7:10 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. మొత్తం 32 రైళ్ల సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే ప్రవేశపెట్టింది.