Smriti Mandhana’s marriage with Palaash Mucchal called off | టీం ఇండియా స్టార్ ప్లేయర్ స్మృతి మందనా-మ్యూజిక్ కంపోసర్ పలాశ్ ముచ్చల్ పెళ్లి రద్దు అయ్యింది. ఈ విషయాన్ని స్మృతి అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తున్నట్లు అభిమానులు, మీడియా మరియు ఇతరులు కూడా వదిలెయ్యాలని కోరారు.
కాగా స్మృతి-పలాశ్ ల వివాహం అర్ధాంతరంగా ఆగిపోయింది. తొలుత వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి. అలాగే పలాశ్ స్మృతిని చీట్ చేశారని ప్రచారం సైతం జరిగింది. కానీ ఇరు కుటుంబాలు మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అంతేకాకుండా స్మృతి తన సోషల్ మీడియా ఖాతా నుండి నిశ్చితార్థం, ప్రీ వెడ్డింగ్ కు సంబంధించిన ఫోటోలను తొలయించడం హాట్ టాపిక్ గా మారింది. గత కొన్నిరోజులుగా వీరి వివాహం పై అనేక పుకార్లు షికారు చేశాయి.
ఈ క్రమంలో స్మృతి అధికారికంగా స్పందించారు. పెళ్లి క్యాన్సల్ అయినట్లు స్పష్టం చేశారు. ఈ విషయానికి ఇక్కడితే ముగింపు పలకాలని కోరారు. ఇరు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలన్నారు. అలాగే టీం ఇండియా తరఫున ఆడుతూ ఎన్నో విజయాలు, మరెన్నో ట్రోఫీలు సాధించడమే తన లక్ష్యం అని స్మృతి పేర్కొన్నారు.









