Shikhar Dhawan Retirement | గబ్బర్ ( Gabbar ) గా పేరొంది భారత్ కు ఎన్నో విజయాలను అందించిన ఓపెనర్ శిఖర్ ధావన్ ( Shikhar Dhawan )అనూహ్యంగా క్రికెట్ కు తుది వీడ్కోలు పలికారు. ఇంటర్నేషనల్ ( International ), డొమెస్టిక్ ( Domestic ) క్రికెట్ కు శిఖర్ వీడ్కోలు పలకడం అభిమానులను షాక్ కు గురిచేసింది.
ప్రస్తుత, మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్ రిటైర్మెంట్ ( Retirement ) పట్ల స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ) స్పందించారు.
శిఖర్ డెబ్యూ ( Debut ) మ్యాచులోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, కీలక ఓపెనర్ గా మారే వరకు ఎన్నో జ్ఞాపకాలు అందించినట్లు విరాట్ గుర్తుచేసుకున్నారు. ధావన్ ట్రేడ్ మార్క్ ( Trade Mark ) నవ్వును మిస్ అవుతున్నట్లు చెప్పారు. తన మంచి మనసు, జ్ఞాపకాలు ఎప్పటికీ మరచిపోలేనివని పేర్కొన్నారు.
మరోవైపు ధావన్ తో కలిసి ఎన్నో రికార్డులు సృష్టించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ( Hit Man Rohit Sharma ) స్పందించారు. “రూమ్ లను పంచుకోవడం నుండి ఫిల్డ్ లో కలిసి ఆడిన ఆట వరకు ఎన్నో అద్భుత జ్ఞాపకాలు. అవితలి ఎండ్ లో ఉంటూ నా పనిని సులభతరం చేశావు” అని మధుర జ్ఞాపకాలను రోహిత్ స్మరించుకున్నారు.