Saying ‘I love you’ in public not sexual assault: Chhattisgarh HC | బాలికకు ఐ లవ్ యూ చెప్పడాన్ని లైంగిక వేధింపు కింద పరిగణించలేమని ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర హై కోర్టు స్పష్టం చేసింది.
ఈ మేరకు పొక్సో చట్టం కింద కేసు నమోదైన యువకుడిని నిర్దోషిగా ప్రకటించింది. 2019లో ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఓ కేసు నమోదైంది. పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న 15 ఏళ్ల బాలికకు ఓ యువకుడు ఐ లవ్ యూ అని చెప్పాడు. దింతో సదరు బాలిక కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ నేపథ్యంలో పోలీసులు యువకుడిపై ఐపీసీ 354డీ, 509, పొక్సో చట్టంలోని సెక్షన్ 8 మరియు ఎస్సీ-ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. తాజగా ఆ రాష్ట్ర హై కోర్టు ఈ కేసుకు సంబంధించి సంచలన తీర్పును వెలువరించింది.
నిందితుడు “ఐ లవ్ యూ” అని చెప్పినంత మాత్రాన దానిని లైంగిక వేధింపుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. వ్యక్తీకరణలో లైంగిక ఉద్దేశ్యం లేదని, బాలికపై అసభ్యంగా తాకడం, అసభ్యకరమైన సైగలు చేయడం లేదా లైంగిక వాంఛతో కూడిన ఇతర చర్యలకు సంబంధించిన ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది.








