Saturday 10th May 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > పవన్ కళ్యాణ్ గారు ఆలయాల్లో ప్రసాదంతో పాటు వీటిని కూడా ఇవ్వండి

పవన్ కళ్యాణ్ గారు ఆలయాల్లో ప్రసాదంతో పాటు వీటిని కూడా ఇవ్వండి

Sayaji Shinde Meets Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ను ప్రముఖ నటుడు షాయాజి షిండే కలిశారు.

ఆలయాల్లో ప్రసాదంతోపాటు ఒక మొక్కను కూడా భక్తులకి అందిస్తే పచ్చదనం పెరుగుతుందని షాయాజీ షిండే ఇటీవల ఒక టీవి కార్యక్రమంలో తెలియజేసి, ఈ అంశం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్ళి తన ఆలోచనలు పంచుకుంటానని అన్నారు.

ఈ క్రమంలో మంగళవారం ఆయన మంగళగిరి ( Mangalagiri ) లోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి విచ్చేసి భేటీలో పాల్గొన్నారు. ఆలయంలో ప్రసాదంతో పాటు భక్తులకు ఓ మొక్క ఇవ్వాలన్న షాయాజీ షిండే సూచనను పవన్ స్వాగతించారు. ఇది చాలా గొప్ప ఆలోచన అని అభినందించారు.

ఈ సందర్భంగా మొక్కలు, వాటి విశిష్టతపై మరాఠీ ( Marati )లో షాయాజీ షిండే తాను రాసిన కవితను పవన్ కళ్యాణ్ కి చదివి వినిపించారు. ఆ కవితను పవన్ కళ్యాణ్ ప్రశంసించడంతో పాటు తెలుగులో అనువదించి చెప్పారు.

You may also like
‘గెలవాలని మొక్కుకున్న 96 ఏళ్ల వృద్ధురాలు..అభిమానిని కలిసిన పవన్’
అయ్యా మాకు లోన్లు ఇవ్వండి..పాక్ భిక్షాటన !
‘ఒక నెల జీతం నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు విరాళం గా ఇద్దాం’
‘భారత్ vs పాక్..అంబటి రాయుడిపై ఫైర్’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions