Sara Tendulkar facing backlash after beer bottle video goes viral | మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ వివాదంలో చిక్కుకున్నారు. తన గోవా పర్యటనలో భాగంగా స్నేహితులతో ఆమె రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇదే సమయంలో సారా చేతిలో బీర్ బాటిల్ కనిపించింది. దింతో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కారణం సచిన్ టెండూల్కర్ తన తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి జీవితంలో ఇప్పటివరకు పొగాకు, మద్యపానంకు సంబంధించిన ఉత్పత్తులను ప్రచారం చేయలేదు. కానీ సచిన్ కుమార్తె మాత్రం తండ్రి శైలికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇదే సమయంలో మరికొందరు మాత్రం ఆమెకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. న్యూ ఇయర్ సంబరాల్లో భాగంగా సారా టెండూల్కర్ గోవా వెళ్లారు. అక్కడ స్నేహితులతో కలిసి ఆరోసిమ్ బీచ్ సమీపంలోని రోడ్డుపై నడుస్తూ కనిపించారు. ఆమె చేతిలో బీర్ బాటిల్ కనిపించడం ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువు అయ్యింది. సచిన్ ఎల్లప్పుడూ దూమపానం, మద్యపానంకు వ్యతిరేకంగా సందేశాలు ఇస్తారని కానీ ఆయన కుమార్తె ఇలా ప్రవర్తించడం తప్పని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.









