Monday 12th January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > కృష్ణజింకల కేసులో క్షమాపణలు చెప్పాలి..సల్మాన్ తండ్రి ఏమన్నారంటే

కృష్ణజింకల కేసులో క్షమాపణలు చెప్పాలి..సల్మాన్ తండ్రి ఏమన్నారంటే

Salman Khan vs Lawrence Bishnoi | గ్యాంగ్ స్టర్ ( Gangster ) లారెన్స్ బిష్ణోయ్ ( Lawrence Bishnoi ) గ్యాంగ్ నుండి ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ కు వరుస బెదిరింపులు వస్తున్న విషయం తెల్సిందే.

బిష్ణోయ్ వర్గం ఎంతో పవిత్రంగా భావించే కృష్ణజింకను వేటాడి తమ వర్గ మనోభావాలను దెబ్బతీశారని, ఇందుకు సల్మాన్ ను చంపుతామని లారెన్స్ ప్రకటించిన విషయం విదితమే. ఈ క్రమంలో ప్రముఖ రైతు నాయకుడు రాకేష్ టికాయత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ దుర్మార్గులని, వారు ఎంతకైనా తెగిస్తారని ఆయన చెప్పారు. ఇప్పటికైనా బిష్ణోయ్ లకు సంబంధించిన ఏదొక ఆలయానికి వెళ్లి సల్మాన్ ఖాన్ ( Salman Khan ) బహిరంగ క్షమాపణలు కోరాలని రాకేష్ సూచించారు.

ఇలా చేస్తే బిష్ణోయ్ తెగ కోపం తగ్గి, సమస్య తగ్గుముఖం పట్టె అవకాశం ఉందన్నారు. అయితే ఈ సూచనపై సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ ( Saleem Khan )స్పందించారు. సల్మాన్ కు ముగజీవాలను వెంటడం ఇష్టం ఉండదు. క్షమాపణలు చెబితే నేరం అంగీకరించినట్లే అవుతుంది, తన తనయుడికి బొద్దింకలను చంపడం కూడా తెలియదు అని సలీం ఖాన్ తెలిపారు.

You may also like
అల్లు అర్జున్ పాట పాడి అదరగొట్టిన కేంద్రమంత్రి
చెప్పులు లేకుండా రోడ్డుపై రౌడీలు..గుంటూరు పోలీసుల తీరే వేరు!
‘హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారు’..ఒవైసీ vs బండి
సైబర్ వలలో జేడీ లక్ష్మీనారాయణ సతీమణి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions