Sajjanar Warning To Betting App Promoters And Influencers | బెట్టింగ్ యాపులను ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ( Influencers ) పై విరుచుకుపడుతున్నారు సీనియర్ ఐపీఎస్, తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సజ్జనర్.
ఇప్పటికే ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టుల ఆధారంగా పలువురు యూట్యూబర్ల పై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో భాగంగా ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ పై కూడా సూర్యాపేట పోలీసులు కేసును నమోదు చేశారు.
అయితే యూట్యూబ్ వీడియోల ద్వారా తమకు డబ్బులు రావని, అందుకోసమే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినట్లు భయ్యా సన్నీ యాదవ్ ఓ ఛానల్ ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పారు. ఈ నేపథ్యంలో సజ్జనర్ స్పందించారు.
చూశారా.. వీళ్ళు మనుగడ సాగించేందుకు వేరే ఆప్షన్ లేదంట, బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయడమే ఒక్కటే మార్గమట అంటూ భయ్యా సన్నీ యాదవ్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ సజ్జనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ జీవితాలను బాగు చేసుకునేందుకు ఎంతో మంది జీవితాలను సర్వనాశనం చేయడం ఎంత వరకు కరెక్ట్ అని నిలదీశారు.
ఎందరో బెట్టింగ్ కు బానిసలై ఆత్మహత్యలు చేసుకోవడం మీకు కనిపించడం లేదా.. కండ్లుడి కూడా చూడలేకపోతున్నారా!? అంటూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ప్రశ్నించారు. యూట్యూబ్ లో వ్యూస్ ( Views ) తగ్గి డబ్బులు రాకపోతే ఫాలోవర్స్ ని మోసం చేస్తారా!? వీళ్లకు వ్యూస్ ద్వారా వచ్చే డబ్బే ముఖ్యం. డబ్బు కోసం ఏమైనా చేస్తారు.. అందుకే అభిమానంతో ఫాలో అవుతున్న ఎంతో మందిని బెట్టింగ్ కు బానిసలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని సజ్జనర్ కన్నెర్ర చేశారు.









