RTC MD Sajjanar News | తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీగా ఉన్న ఐపీఎస్ అధికారి సజ్జనర్ ను హైదరాబాద్ కమిషనర్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో సోమవారం సజ్జనర్ ఆర్టీసీ ఎండీగా చివరి రోజు విధులు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రజా రవాణాపై అనుబంధాన్ని వ్యక్తం చేస్తూ.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. సాధారణ ప్రయాణికుడిలా లక్డీకాపుల్-టెలిఫోన్ భవన్ బస్టాండ్ నుంచి బస్ భవన్ వరకు 113 రూట్ బస్సులో ప్రయాణించారు.
యూపీఐ పేమెంట్ చేసి కండక్టర్ వద్ద టికెట్ తీసుకున్నారు. అనంతరం ప్రయాణికులతో ముచ్చటించారు. కాగా ఆర్టీసీ ఎండీగా సజ్జనర్ బాధ్యతలు చేపట్టిన అనంతరం సంస్థ లాభాల బాట పట్టిన విషయం తెల్సిందే.









