FASTag Annual Pass | వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. టోల్ ఛార్జీలకు సంబంధించి ఓ కీలక ఆఫర్ ప్రకటించింది.
నాన్ ట్రాన్స్ పోర్ట్ వాహనాలైన కార్లు, జీపులు, వ్యాన్ లకు రూ.3 వేలు చెల్లిస్తే ఒక సంవత్సరంపాటు దేశంలో ఎక్కడైనా.. ఏ టోల్ గేట్ల పరిధిలోనైనా 200 ట్రిప్పుల ప్రయాణం చేసేలా వెసులుబాటు కల్పించింది.
ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ బుధవారం ఈ ప్రకటన చేసింది. ఆగస్టు 15 నుంచి దేశ వ్యాప్తంగా ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నట్లు తెలిపింది.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై మంత్రి నితిన్ గడ్కరీ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. రూ.3 వేలతో FASTag- ఆధారిత ఆనువల్ పాస్ ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. 2025 ఆగస్టు 15 నుంచి ఈ విధానం అమలుల్లోకి రానుందని పేర్కొన్నారు.
ఏడాదిలో 200 ట్రిప్లు ముగిసేంత వరకు చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేశారు. ఈ స్కీమ్ యాక్టివేషన్, రీన్యూవల్ కు సంబంధించి త్వరలోనే ప్రత్యేక వెబ్సైట్ లింక్, రాజ్ మార్గ్ యాత్ర యాప్ తో పాటు NHAI, MORTH అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.







