Saturday 28th February 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘తప్పంతా EVM లదే..రోజా కామెంట్స్’

‘తప్పంతా EVM లదే..రోజా కామెంట్స్’

Roja News Latest | కూటమి ప్రభుత్వ విధానాలపై మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా విరుచుకుపడ్డారు. కూటమి అధికారాన్ని చేపట్టిన తర్వాత నుండి ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని రోజా ఆరోపించారు.

మెడికల్ కాలేజీలకు మంగళం పాడేశారు, రైతు భరోసా కేంద్రాలను ఎత్తేస్తున్నారు.. ఇప్పుడు బడుల వంతు అని ఆమె పేర్కొన్నారు.

అయినా “విద్య ప్రభుత్వ బాధ్యత కాదు” అని ముందే మీరు చెప్పారు లెండి అంటూ చంద్రబాబు సర్కారుపై విమర్శలు గుప్పించారు. తప్పు మీది కాదు.. తప్పంతా #EVM లదే అని ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన పోస్టు చేశారు.

ఐదు కిలోమీటర్ల పరిధిలో గ్రామంలో ఒకే పాఠశాల ఉండాలా..? గ్రామంలో ఎన్ని బ్రాందీ షాపులైనా, ఎన్ని బెల్ట్ షాపులైనా ఉండవచ్చా…? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. బాగుందాయ్యా … బాగుంది ! అని… ఊరంతా గుసగుసలాడుకుంటున్నారని తెలుస్తోందని ఎద్దేవా చేశారు.

You may also like
జమ్మూ జయహో..67 ఏళ్ల నిరీక్షణకు తెర!
రాష్ట్రంలో భారీ పేలుడు..భారీగా మృతులు
మెప్పు కోసం గొప్పలకు వెళ్లొద్దు..మంచు సందేశం
ఇరాన్ పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..ఏం జరగనుందో!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions