Roja Daughter Anshumalika Latest News | వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా కుమార్తె అన్షుమాలికకు సంబంధించి పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆమె సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నట్లు, అలాగే ఓ స్టార్ హీరో ఇంటికి కోడలిగా వెళ్లనున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. తాజగా ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చారు రోజా.
అన్షుకు నటి కావాలనే కోరిక లేదని తెలిపారు. ఆమె సైంటిస్ట్ కావాలనుకుంటోందని, అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తూ పరిశోధనలపై దృష్టి సారిస్తోందని చెప్పారు. ఇటాలియన్ భాష కూడా నేర్చుకుంటోందని పేర్కొన్నారు. పిల్లలపై తాను ఎలాంటి ఒత్తిడి పెట్టనని, వాళ్ల భవిష్యత్తును నిర్ణయించుకునే స్వేచ్ఛ వారికి ఉంటుందన్నారు. ఒక స్టార్ హీరో ఇంటి కోడలు కాబోతోందనే ప్రచారంపై స్పందిస్తూ…ఆ స్టార్ ఎవరో చెబితే తాను కూడా తెలుసుకుంటానని నవ్వుతూ సమాధానమిచ్చారు.









