Rohit Sharma’s old tweet goes viral after captaincy snub | టీం ఇండియా వన్డే కెప్టెన్ గా రోహిత్ శర్మను తప్పిస్తూ శుభమన్ గిల్ ను నియమిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు 13 ఏళ్ల క్రితం రోహిత్ శర్మ చేసిన ఒక ట్వీట్ వైరల్ గా మారింది.
45 శకం ముగిసింది, ఇక 77 జర్నీ ప్రారంభం అవుతుంది అని 2012లోనే రోహిత్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. కాగా రోహిత్ శర్మ జెర్సీ నంబర్ 45, అలాగే శుభమన్ గిల్ జెర్సీ నంబర్ 77. రోహిత్ స్థానంలో గిల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఈ ట్వీట్ తాజగా వైరల్ గా మారింది. 13 ఏళ్ల క్రితమే రోహిత్ భవిష్యత్ ను అంచనా వేశారని పలువురు కామెంట్లు పెడుతున్నారు. అయితే అప్పుడు రోహిత్ అలా ఎందుకు ట్వీట్ చేశారో అనేది మాత్రం తెలీదు.
ఇకపోతే అక్టోబర్ 19 నుంచి టీం ఇండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఇందులో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ-20లు ఆడనుంది. ఈ క్రమంలో శనివారం టీం ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. వన్డే సిరీస్ కోసం కెప్టెన్ గా గిల్, వైస్ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ను ఎంపిక చేసింది. సీనియర్లు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ మాత్రం ప్లేయర్లుగా కొనసాగనున్నారు.









