Supreme Court On Menstrual Health | మహిళల నెలసరి ఆరోగ్యానికి (Menstual Health)కు సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది.
మహిళలకు నెలసరి పరిశుభ్రత అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (Article 21) కింద ప్రాథమిక హక్కులో భాగమేనని వ్యాఖ్యానించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు బయోడిగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్లను (Sanitary Pads) ఉచితంగా అందించాలని స్పష్టం చేసింది.
న్యాయమూర్తులు జస్టిస్ జె.బి. పర్దివాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం అన్ని పాఠశాలల్లో అబ్బాయిలకు, అమ్మాయిలకు వేర్వేరు మరుగుదొడ్లు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించింది.
అలాగే ప్రభుత్వమైనా, ప్రైవేటైనా అన్ని పాఠశాలల్లో వికలాంగులకు అనుకూలమైన మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని పేర్కొంది.
ఈ సదుపాయాలు కల్పించడంలో విఫలమైతే ప్రైవేట్ పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తామని కోర్టు హెచ్చరించింది.
ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించినా బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపింది. జయా ఠాకూర్ దాఖలు చేసిన పిల్‌పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.








