Wednesday 14th May 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన రతన్ టాటా అస్తమయం

దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన రతన్ టాటా అస్తమయం

Ratan Tata Death News | దేశ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేసిన దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ ( Tata Sons ) గౌరవ అధ్యక్షులు, పద్మ విభూషన్ రతన్ టాటా ( Ratan Tata ) కన్నుమూశారు.

అనారోగ్య కారణాలతో ముంబై బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో ఐసీయూ లో చికిత్స పొందుతూనే బుధవారం రాత్రి 11 గంటల 30 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.

రతన్ టాటా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సోమవారం వార్తలు వచ్చాయి. అయితే తన ఆరోగ్యం నిలకడగానే ఉందని టాటా ఎక్స్ ( X ) వేదికగా పోస్ట్ చేసిన విషయం తెల్సిందే. ఇంతలోనే ఆయన ఆరోగ్యం విషమించి కన్నుమూశారు. టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ ( N. Chandrashekaran )ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

మానవతావాది టాటా మనకు దూరం అయ్యారని ప్రధాని మోదీ ( Pm Modi ) దిగ్భ్రాంతి వ్యక్తపరిచారు. ఘన చరిత్ర కలిగిన టాటా గ్రూప్ సామ్రాజ్యానికి రతన్ టాటా మంచి నాయకత్వాన్ని అందించారని పేర్కొన్నారు. సంస్థకే కాకుండా దేశానికి ఎనలేని సేవాలందించారని కొనియాడారు.

1937 డిసెంబర్ 28న నావల్ టాటా, సోనూలకు రతన్ టాటా జన్మించారు. 8వ తరగతి వరకు ముంబైలో చదివారు. ఉన్నత చదువులు ముగించిన తర్వాత, 1991 లో టాటా సన్స్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన రతన్ టాటా సంస్థను భారీగా విస్తరించారు.

You may also like
‘PSPK’s OG..ఈసారి ముగిద్దాం’
గతంలో ఉగ్రవాది..ప్రస్తుత సిరియా అధ్యక్షుడితో ట్రంప్ భేటీ
ఆ రోజు ఆయుర్వేద దినోత్సవం..ప్రత్యేకత ఏంటో తెలుసా!
తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి ‘సరస్వతీ పుష్కరాలు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions