Union Minister Rajnath Singh Helicopter | పెట్రోల్ అయిపోవడంతో వాహనాలు నిలిచిపోతుంటాయి. ఈ సమస్య కేవలం సామాన్య ప్రజలకే కాకుండా అప్పుడప్పుడు కేంద్రమంత్రులకు కూడా ఎదురవుతుంది. ఇలాంటి ఘటనే కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు ఎదురైంది.
బీజేపీ పరివర్తన్ ర్యాలీలో పాల్గొనేందుకు శనివారం ఝార్ఖండ్ లోని గడ్వా ప్రాంతానికి హెలికాప్టర్ ద్వారా వెళ్లారు. ర్యాలీ ముగిసిన అనంతరం తిరిగి హెలికాప్టర్ లో యూపీలోని వారణాసికి వెళ్ళాలి. ఇంతలోపే హెలికాఫ్టర్ లో ఇంధనం తిరిగి నింపకపోవడంతో ఆయన రోడ్డు మార్గాన వెళ్లాల్సి వచ్చింది.
హెలికాప్టర్ కోసం ఇంధనాన్ని తోసుకువస్తున్న ట్యాంకర్ సకాలంలో అక్కడికి చేరుకోలేదు. దింతో సుమారు గంట సేపు ఎదురుచూసిన కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ చేసేదేమీలేక 200 కీ. మీ. దూరంలో ఉన్న వారణాసికి రోడ్డుమార్గాన వెళ్లారు. ఆయన వెంట కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కూడా ఉన్నారు.