Rahul Gandhi Questions to EC | భారత ఎన్నికల సంఘం, భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపి దేశంలో నిర్వహించే ఎన్నికలను ప్రభావితం చేస్తోందందటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
బీజేపీకి మేలు చేయడం కోసమే ఎన్నికల సంఘం పనిచేస్తోందంటూ రాహుల్ ఆరోపించారు. అంతేకాకుండా ఓటర్ల జాబితాలో విచ్చలవిడిగా నకిలీ ఓటర్లను చేర్చుతోందన్నారు. తాజాగా ఎక్స్ వేదికగా శుక్రవారం ఈసీకి ఐదు ప్రశ్నలు సంధించారు రాహుల్ గాంధీ.
డిజిటల్ ఓటర్ల జాబితాను ఎందుకు దాచి పెడుతున్నారు?
సీసీ ఫుటేజీని ఎందుకు, ఎవరి ఆదేశాలతో తొలగిస్తున్నారు?
నకిలీ ఓట్ల నమోదును ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? విపక్షాలను ఈసీ ఎందుకు భయపెడుతోంది? బీజేపీ ఏజెంట్ గా ఈసీ మారిపోయిందా? అని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. తన ప్రశ్నలకు ఈసీ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.









