RaghuRama Krishnaraju Shocking Comments On Bhimavaram DSP | భీమవరం డీఎస్పీ జయసూర్యపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. ఇదే సమయంలో భీమవరం డీఎస్పీ మంచి అధికారే అని ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించడం ఆసక్తిగా మారింది. తనకున్న సమాచారం మేరకు భీమవరం డీఎస్పీ జయసూర్యకు మంచి ట్రాక్ రికార్డు ఉందన్నారు.
మరోవైపు డీఎస్పీ పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోతున్నాయని, సివిల్ వివాదాల్లో ఆయన జోక్యం చేసుకుంటున్నారని తనకు ఫిర్యాదులు అందినట్లు పవన్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ వ్యవహారం పై పశ్చిమగోదావరి ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన పవన్ జయసూర్యపై నివేదిక సిద్ధం చేసి పంపాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో రఘురామ తాజగా మీడియాతో మాట్లాడారు. గోదావరి జిల్లాల్లో పేకాట శిబిరాలపై పోలీసులు గట్టి నిఘా పెట్టారని పేర్కొన్నారు.
ఈ కారణంగానే కొందరు డిఎస్పీ జయసూర్యపై ఫిర్యాదు చేసి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. తన సొంత నియోజకవర్గం ఉండిలో పేకాట శిబిరాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందన్నారు. అలాగే తన శాఖలే కాకుండా ఇతర శాఖలను కూడా పవన్ పట్టించుకోవడం సంతోషించ దగ్గ విషయమని రఘురామ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.









